Upasana: మెగా కోడలు ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. పెళ్లయిన తర్వాత పది సంవత్సరాలకు ఈమె తల్లి కానున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉపాసన సైతం తన ప్రెగ్నెన్సీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఉపాసన సన్నిహితులు తరచు తనకు బేబీ షవర్ వేడుకను నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే దుబాయ్ లో చాలా ఘనంగా వీరి బేబీ షవర్ వేడుక జరిగింది.
ఇకపోతే తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాదులో ఉపాసన బేబీ షవర్ వేడుక జరిగినట్టు తెలుస్తుంది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్టు సమాచారం. అయితే ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సందడి చేయడం విశేషం.ఈ క్రమంలోనే ఉపాసన అల్లు అర్జున్ తో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా ఉపాసన బేబీ షవర్ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ ఉపాసన రాంచరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారని తెలుస్తోంది. ఇకపోతే ఉపాసన ఈ ఫోటోని షేర్ చేయడంతో మెగా అల్లు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Upasana: సంతోషంలో మెగా అల్లు ఫాన్స్…
గత కొద్దిరోజులుగా రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని అందుకే వీరిద్దరూ ఏ ఫంక్షన్ లో కలవడం లేదు అంటూ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి అభిమానుల మధ్య కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. ఇలా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉపాసన ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వార్తలకు పుల్ స్టాప్ పడింది.రామ్ చరణ్ ఉపాసన బేబీ షవర్ వేడుకకు హాజరు కావడంతో ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్థలు లేవని అవన్నీ కేవలం అవాస్తవాలేనని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.