Upasana-Ram Charan: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తొలి సినిమాతోనే నటనలో తండ్రికి తగ్గ కొడుకు గా పేరు తెచ్చుకున్నాడు. ఆ పై పలు సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇటీవలే రాజమౌళి తెర కెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు.
మొత్తానికి చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ప్రస్తుతం హీరో రామ్ చరణ్ ఆర్ సి 15 సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమాను డైరెక్టర్ దిల్ రాజు, సిరిస్ లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ఈ సినిమా షూటింగ్ నేపథ్యం లో వైజాగ్ లో ఉన్నాడు.
ఇక చరణ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెట్టింట్లో పంచుకుంటాడు. ఇక ఇదే క్రమంలో తాజాగా చరణ్ పంచుకున్న పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఉపాసన, రామ్ చరణ్ ల రీసెంట్ ఫోటోలు పంచుకుంటూ ఒక ఆసక్తికరమైన కాప్షన్ ఇచ్చాడు.

Upasana-Ram Charan: చరణ్, ఉపాసన ను కొన్ని రోజులు వెయిట్ చేయమని ఇందుకే!
ఉపాసన.. నా మైండ్లో కూడా వెకేషన్ కి వెళ్లాలని ఆలోచన ఉంది. బట్ ఆర్ సి 15 సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తి కావాలి. కనుక మనం కొన్ని రోజులు ఆగాల్సిందే అంటూ చరణ్ కాప్షన్ రూపంలో చెప్పుకొచ్చాడు. ఇక చరణ్ పంచుకున్న పోస్ట్ ని ఉపాసన స్క్రీన్ షాట్ తీసి తన స్టోరీలో పంచుకుంది.
అంతేకాకుండా.. చరణ్ అన్న దానికి యాక్సెప్ట్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం చరణ్ పంచుకున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ పోస్ట్ పై ఒక లుక్కేయండి.