Upasana: మెగా కోడలు ఉపాసన ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగిన పది సంవత్సరాలకు మెగా ఇంటికి వారసురాలు జన్మించటంతో కుటుంబ సభ్యులందరూ సంబరాలు జరుపుకున్నారు. ఎంతోకాలంగా ఎదురుచూసిన కోరిక నెరవేరడంతో చిరంజీవి కూడా ఆనందం వ్యక్తం చేశాడు. ఇక పాప జన్మించిన కొంతకాలానికి పాపకి క్లింకార అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఉపాసన, రాంచరణ్ ఇద్దరూ కూడా తమ కూతురితో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉపాసన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉన్న అపోలో హాస్పిటల్ లో ఉపాసన బిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.
Upasana: హాస్పిటల్ గదిని డిజైన్ చేయించిన ఉపాసన…
బిడ్డ పుట్టగానే మొదటగా ప్రకృతి ఒడిలో ఉన్నట్లు భావించాలన్న ఉద్దేశంతో గోడలను అందంగా తీర్చిదిద్దారు. దీని కోసం ప్రత్యేక డిజైనర్లు పనిచేశారు. ఆస్పత్రిలో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా ఉపాసన గదిని తీర్చిదిద్దారు. పుట్టిన బేబీ చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్ డిజైన్ చేయించారు. ఫారెస్ట్‌ను తలపించేలా డిజైనర్స్ దీనిని తయారు చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘అమ్రాబాద్ ఫారెస్ట్, వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన చోట జన్మనివ్వడం, నా క్లీంకారను పెంచడం ఎంత ఆనందించానో మీకు చెప్పలేను.’ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.