Upasana: మెగా కోడలు ఉపాసన తల్లిగా ప్రమోట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె తల్లిగా ప్రమోట్ అయిన తర్వాత ఒక బిడ్డ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ బిడ్డ పట్ల తల్లి ఎలా మదన పడుతుందన్న విషయాలను గుర్తించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే బిడ్డల కోసం ఆరాటపడుతున్నటువంటి తల్లుల విషయంలో ఉపాసన ఓ గొప్ప నిర్ణయం తీసుకోవడంతో ఉపాసన పై పెద్ద ఎత్తున నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఉపాసన అపోలో హాస్పిటల్ బాధ్యతలను వ్యవహరించడమే కాకుండా అపోలో హాస్పిటల్స్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా ఉపాసన ఇప్పటికే పలు ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ అక్కడి ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన తల్లిగా మారిన తర్వాత బిడ్డ పట్ల తన భర్త రామ్ చరణ్ తీసుకున్నటువంటి బాధ్యతలను కళ్లారా చూసినటువంటి ఈమెకు మనసులో ఒక సందేహం మొదలైంది.తండ్రి లేని పిల్లల పరిస్థితి ఏంటి? సింగిల్ మదర్స్ వారి పిల్లల ఆరోగ్య విషయంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారన్న విషయాల గురించి ఆలోచించారు. ఇలా ఆలోచన చేసిన ఉపాసన తల్లి మనసు చాటుకుంటూ ఒంటరిగా ఉన్నటువంటి మహిళల పిల్లల విషయంలో ఈమె గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
Upasana: ఆ పిల్లల ఆరోగ్య బాధ్యత మాదే…
ఒంటరి మహిళలు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఇకపై చింతించాల్సిన అవసరం లేదని వారి ఆరోగ్య బాధ్యతలు అన్నింటిని మేము చూసుకుంటాము అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ప్రతి వారం ఒంటరి మహిళల పిల్లలకు ఉచితంగా వైద్యం అందించబోతున్నట్లు ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఎంతోమంది ఉపాసన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా ఉపాసన తల్లిగా మారడంతో ఒక తల్లి బాధ తెలిసిందని అందుకే ఈమె ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటూ ఉపాసన మంచి మనసు పై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.