Upcoming Movies: ఈవారం తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది రాబోతోంది. యువత ఈ పండుగ మీద కన్నా ఈ వారం రిలీజ్ కాబోయే కొత్త చిత్రాలు మీదే వారి దృష్టి అంతా. థియేటర్లోని ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా గతవారం రిలీజ్ అయిన చిత్రాలు సందడి చేస్తూనే ఉన్నాయి అయినా ఉగాది సందర్భంగా మరిన్ని సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి ముందుకొస్తున్నాయి.
కొన్ని వెండి తెరమీద విడుదల కాగా కొన్ని ఓటీటీనే వేదికగా చేసుకుంటున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.అంజలి నటించిన కామెడీ హర్రర్ మూవీ గీతాంజలి హిట్ అయిన దగ్గర్నుంచి ఎక్కువగా అలాంటి సినిమాలు మీద దృష్టి పెడుతున్నారు దర్శకులు. ఆ కోవలోనే వస్తుంది కాజల్ అగర్వాల్ నటించిన కోష్టి. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించగా డైరెక్టర్ కళ్యాణ్ తెరకెక్కించిన తమిళ్ మూవీ ఘోష్టి.
అదే చిత్రాన్ని కోస్టి పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఊర్వసి యోగి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమా రంగ మార్తాండ. రంగస్థల కళాకారుల జీవితాలని కథగా మలిచి తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు కృష్ణవంశీ. ఈ సినిమా మరాఠీ లో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్.
ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్ శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధానపాత్ర పోషించారు. బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత ఫుల్ లెన్త్ రోల్ చేస్తున్న సినిమా ఇది. ఇదే వారం వస్తున్న మరో సినిమా ధమ్కీ. విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన సినిమా ఇది. పాగల్ తర్వాత వస్తున్న సినిమా ఇది. తన సినిమాని వినూత్నంగా ప్రచారం చేయడంలో ముందుంటాడు విశ్వక్ సేన్.
Upcoming Movies:
ఎందుకో ఈసారి ఎలాంటి హడావిడి లేకుండానే నేరుగా థియేటర్లోకి వస్తున్నాడు. వీటితో పాటు గీత సాక్షిగా కూడా సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇదే వారం
ఈటీవీ విన్ లో పంచతంత్రం రిలీజ్ అవుతుంది. ఆహాలో వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లో అమెరికన్ అపోకలిప్స్, ఇంగ్లీష్ మూవీలు రిలీజ్ అవుతాయి.