Upcoming Movies: శుక్రవారం వచ్చిందంటే అందరూ థియేటర్ లో కొత్త సినిమా కోసం ఎదురు చూసేవారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ రానంతవరకు అదే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా సినిమాలు థియేటర్లో కన్నా ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫారం మీదే విడుదలై హిట్ల మీద హిట్లు అందుకుంటున్నాయి. అలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి అవేంటో చూద్దాం.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన సినిమా సార్. థియేటర్లో ఇది మంచి వసూళ్లని వసూలు చేసింది ఇప్పుడు ఓటీటీ లో కూడా మార్చి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. ఫిబ్రవరి 2న ప్రేక్షకులకు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకున్న మరొక సినిమా రైటర్ పద్మభూషణ్.
సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చ్ 17వ తేదీన ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా మార్చి 17న థియేటర్లో విడుదలవుతుంది. ఇదే నెల 17వ తారీఖున మల్టీస్టారర్ చిత్రంగా కబ్జా సినిమా వస్తుంది. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమా పునీత్ రాజ్ కుమార్ జయంతిని పురస్కరించుకొని తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
Upcoming Movies:
కే జి ఎఫ్ కి దీటుగా ఈ చిత్రం ఉండబోతుందని చెప్తున్నారు చిత్ర బృందం. ఇంకా కుత్తే హిందీ మూవీ మార్చ్ 16న , మనీషాట్ ఒరిజినల్ మూవీ మార్చ్ 15న, ఇన్ హిజ్ షాడో మార్చ్ 17న, దా మెజీషియన్ ఎలిఫెంట్ మార్చి 17న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ ఆడమ్, గందధ గుడి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిపై కూడా ఓ లుక్కెయ్యండి.