Upcoming Movies: ఇప్పుడిప్పుడే పరీక్షలు ముగించుకొని ఎంటర్టైన్ వైపు చూస్తున్న విద్యార్థులకు కనిపించేది సినిమాలు మాత్రమే. ఇక ఈవారం థియేటర్లో ఏం సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓటీటీ లో ఏం సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం. ఏప్రిల్ 14వ తారీఖున తెలుగు తమిళ భాషల్లో మన ముందుకి థియేటర్లలో రాబోతున్న సినిమా రుద్రుడు. చాలా రోజుల తర్వాత వెండితెర మీద సందడి చేయబోతున్నాడు రాఘవ లారెన్స్.
ప్రియ భవాని శంకర్ కథానాయకగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామా. హాయిగా సాగిపోతున్న సగటు మనిషి జీవితంలోకి అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడో అని ఆసక్తి కరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం రుద్రుడు.
కదిరేసన్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.
శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇదే 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన మరో సినిమా శాకుంతలం. సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా పౌరాణిక ప్రేమ కథగా రూపుదిద్దుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్రీడీ వర్షన్ లో మన ముందుకి వస్తుంది.
శకుంతల దుశ్యంతుల ప్రేమకావ్యాన్ని కథగా ఎంచుకొని తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. శకుంతల పాత్రని సమంత పోషించగా దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపిస్తారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 15వ తారీఖున థియేటర్లలోకి రాబోతున్న డబ్బింగ్ మూవీ విడుదల పార్ట్ – 1. పిరియాడిక్ క్రైమ్ త్రిల్లర్ నేపథ్యంలో మన ముందుకి వస్తుంది.
సూరి విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయాన్ని సాధించింది. ప్రముఖ గీత ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని మనకి తెలుగులో అందిస్తుంది. ఇక ఓటిటిలో అసలు పేరుతో రవిబాబు తీసిన సినిమా ఏప్రిల్ 13న ఈటీవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. అలాగే విశ్వక్సేల్ దాస్ కా దమ్ కి కూడా ఆహలో ఏప్రిల్ 14న విడుదలవుతుంది.
Upcoming Movies
ఇంకా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టైము బ్యూటిఫుల్ థింగ్స్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న, ఓ కల ఏప్రిల్ 13న రిలీజ్ అవుతుంది. జి ఫైవ్ లో మిస్సెస్ అండర్ కవర్ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది అలాగే అమెజాన్లో ద మార్వెల్ మిసెస్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. నెక్లెస్ లో ఫ్లోరియమేన్ ఏప్రిల్ 13న అబ్సెషన్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 13న, క్వీన్ మేకర్ కొరియన్ సిరీస్ ఏప్రిల్ 14న లాస్ట్ కింగ్డమ్ ఏప్రిల్ 14న రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి