Upcoming Movies: మొత్తానికి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టగానే మొదటి వారంలో మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా సందడి చేశాయి. ఇక ఈ వారం మాత్రం సందడి మామూలుగా ఉండదని చెప్పాలి. పైగా సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. బాక్సాఫీస్ ను బద్దలు చేయటానికి పెద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టాయి. ఇదంతా చూస్తుంటే అసలైన సంక్రాంతి సందర్భాలు ఈసారి థియేటర్లోనే అనిపిస్తున్నాయి. ఇంతకు బాక్సాఫీస్ బద్దల్ చేయడానికి వస్తున్న సినిమాలు ఏవో చూద్దాం.
స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘తునివు’ అనే తమిళ మూవీ తెలుగులో తెగింపుగా విడుదలవుతుంది. ఇక ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నందమూరి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి కూడా సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న థియేటర్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈనెల 13న విడుదలకు సిద్ధంగా ఉంది. మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించగా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు వెలవడుతున్నాయి. మరో స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా వారీసు. ఈ సినిమా తెలుగులో వారసుడుగా విడుదల కానుంది. వంశి పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 11న తమిళంలో, 14న తెలుగులో విడుదల కానుంది. ఇక చిన్న హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం అనే సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా ఈ పెద్ద సినిమాలతో పోటీకి వస్తుంది. ఇక ఈ సినిమా 14న థియేటర్లో విడుదల కానుంది.
ఓటిటిలో విడుదల కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో హంటర్స్ అనే వెబ్ సిరీస్, హిందీ దృశ్యం టూ 13న విడుదల కానున్నాయి. జి ఫైవ్ లో హెడ్ బుష్ అనే తెలుగు డబ్బింగ్, తట్టస్సెరి కూట్టం అనే మలయాళం మూవీ 13న రానున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చేజింగ్ వేవ్స్ అనే వెబ్ సిరీస్ జనవరి 11న, ముకుందన్ ఉన్ని అసోయేషన్స్ అని మలయాళం మూవీ జనవరి 13న విడుదల కానుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో సెక్సీ ఫై అనే వెబ్ సిరీస్ సీజన్ 2 జనవరి 11న,
Upcoming Movies:
వైకింగ్స్ : వల్హల్లా అని వెబ్ సిరీస్ జనవరి 12, బ్రేక్ పాయింట్, డాగ్ గాన్, ట్రయల్ బై ఫైర్ అనే హిందీ మూవీ, స్కై రోజో అనే స్పానిష్ మూవీలు 13న విడుదల కానున్నాయి. కుంగ్ ఫూ పాండా: ది డ్రాగన్ నైట్ అనే వెబ్ సిరీస్ 12న, వరలరు ముఖ్యం అనే తమిళ్ సిరీస్ 15న విడుదల కానున్నాయి. లయన్స్ గేట్ ప్లే లో లంబోర్గిని: ద మ్యాన్ బిహైండ్ ద లెజెండ్ హాలీవుడ్ సిరీస్ జనవరి 13న, వూట్ లో విక్రమ్ వేద అనే హిందీ సిరీస్ జనవరి 9న విడుదల కానున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి ఈ సినిమాలు అలరించనున్నాయి.