Upcoming Movies: ఎండలతో ఉక్కపోతలతో అల్లాడిపోతున్న జనాలకి ఎంటర్టైన్మెంట్ గా ఈవారం వస్తున్న థియేటర్ సినిమాలు కాస్త తక్కువనే చెప్పాలి. ఓటీటీలో మాత్రం వెబ్ సిరీస్ లు, మూవీస్ ఎక్కువగానే ఉన్నాయి. ముందుగా థియేటర్లో ఏ చిత్రాలు వస్తున్నాయో చూద్దాం.
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా ఏప్రిల్ 21న విడుదలవుతున్న సినిమా విరూపాక్ష. ఈ సినిమాకి దండు కార్తీక్ దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లే డైరెక్టర్ సుకుమార్ అందించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్షన్ వహించాడు.
మిస్టరీగా థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాయి. ఈ రుద్రమనాన్ని కాపాడగల విరూపాక్షమి నువ్వే అంటూ టీజర్ లో వచ్చిన డైలాగ్ ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందింది. ఒకే ఒక్క పాత్రతో పైవిద్యంగా మన ముందుకి వస్తున్న మరో సినిమా హలో మీరా..
ఈ వైవిధ్యమైన సినిమాకి దర్శకుడు కాకర్ల శ్రీనివాస్ ప్రఖ్యాత దర్శకుడు బాపు కి ప్రియ శిష్యుడు. ఏప్రిల్ 21 న ఈ మూవీ రిలీజ్ అవుతుంది భారీ భారీ డైలాగులు, అట్రాక్ట్ చేసే డ్యూయెట్లులేకుండా పూర్తి భిన్నంగా సింగిల్ క్యారెక్టర్ తో సినిమా తీయడం అంటే గొప్ప సాహసం అనే చెప్పుకోవాలి తెరపై కనిపించేది మీరానే అయినా వినిపించే పాత్రలన్నీ సగటు ప్రేక్షకుడికి మదిలో మెదిలేలా రూపొందించారు. ఇందులో ఉన్న ఏకైక పాత్రలో గార్గేయ ఎల్లాప్రగడ నటిస్తుంది.
Upcoming Movies:
ఇక ఈవారం ఓటీటీలో వస్తున్న చిత్రాలు చూద్దాం. సోనీలివ్ లో గర్మీ సిరీస్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శుభ డాక్యుమెంటరీ స్పెషల్. నెట్ఫ్లిక్స్ లో హౌ టు గెట్ రిచ్ ఇంగ్లీష్ మూవీ, చింప్ ఎంపైర్ డాక్యుమెంటరీ, ద మార్కెడ్ హార్ట్ సీజన్ 2, చోట బీమ్ సీజన్ 17, సత్య టు తెలుగు, రెడీ తెలుగు, అలాగే ఏప్రిల్ 21న ఇండియన్ మ్యాచ్ మేకింగ్ వెబ్ సిరీస్, ఏ టూరిస్ట్ గైడ్ టు లవ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.