Upcoming Movies: మొత్తానికి సంక్రాంతి ముగిసిన తర్వాత కూడా మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాలు అయినప్పటికీ కూడా బాగానే సక్సెస్ అందుకున్నాయి. ఇక సంక్రాంతికే కాకుండా ఈ సమయంలో కూడా స్టార్ హీరోల సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ వారం థియేటర్, ఓటీటీ లో విడుదల కానున్న సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనే నటించిన పటాన్ సినిమా జనవరి 25న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, శ్రీకాంత్ నటించిన సినిమా హంట్. డైరెక్టర్ మహేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందిన సినిమా గాంధీ.. గాడ్సే ఏక్ యుద్. ఈ సినిమా కూడా జనవరి 26న విడుదల కానుంది.
డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందిన సినిమా సింధూరం. ఈ సినిమా కూడా జనవరి 26న విడుదల కానుంది. డైరెక్టర్ విష్ణు శశి శంకర్ దర్శకత్వంలో మాలికాపురం అనే సినిమా రూపొందిగా ఈ సినిమా కూడా ఈ వారంలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
Upcoming Movies:ఓటీటీ లో విడుదలయ్యే వెబ్ సిరీస్, సినిమాలు ఇవే..
ఆహాలో నిఖిల్, అనుపమ జంటగా నటించిన 18 పేజెస్ జనవరి 27న స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో నార్విక్ అనే హాలీవుడ్ మూవీ జనవరి 23న, బ్లాక్ షన్ షైన్ బేబీ అనే డాక్యుమెంటరీ జనవరి 24న,18 పేజెస్ జనవరి 27న స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంగ్గా హాస్టల్ అనే తమిళ్ సిరీస్ జనవరి 27న, షాటిగన్ వెడ్డింగ్ అనే హాలీవుడ్ సిరీస్, యాక్షన్ హీరో అనే హిందీ సిరీస్ జనవరి 27న స్ట్రీమింగ్ కానున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎక్స్ట్రాడినరీ ఒరిజినల్ సిరీస్ జనవరి 25న, డియర్ ఇష్క్ అనే హిందీ సిరీస్ జనవరి 26న, సాటర్డే నైట్ అనే మలయాళం సిరీస్ జనవరి 27న విడుదల కానుంది. జీ ఫైవ్ అయలీ అనే తెలుగు, తమిళ్ సిరీస్, జాన్ బాజ్ హిందుస్థాన్ కీ అనే హిందీ సిరీస్ జనవరి 26న విడుదల కానుంది.