Upcoming Movies: మొత్తానికి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం మొదటి నెల పూర్తవటం.. ఈ మధ్యలో మంచి మంచి సినిమాలు రావడం జరిగింది. కొత్త సంవత్సరం నుండి మొన్నటివరకు ప్రేక్షకుల ముందుకు మంచి మంచి సినిమాలు వచ్చి బాగా సందడి చేశాయి. సంక్రాంతికి మాత్రం స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ ను బద్దలు చేశాయి. ఇక ఫిబ్రవరి వారంలో కూడా మంచి మంచి సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
సందీప్ కిషన్, వరలక్ష్మి శరత్ కుమార్, విజయ్ సేతుపతి తదితరులు నటించిన సినిమా మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 3 న విడుదల కానుంది. డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఇందులో సుహాస్, టిన శిల్ప రాజ్, ఆశిష్ విద్యార్థి, గౌరీ ప్రియ తదితరులు నటించిన ఈ సినిమా కూడా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
పెళ్లి తర్వాత సువర్ణ సుందరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది పూర్ణ. ఇక ఈ సినిమాకు సురేంద్ర మాచారపు దర్శకత్వం వహించగా ఈ సినిమా కూడా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో రూపొందిన సినిమా ప్రేమదేశం. ఈ సినిమా కూడా 3 న విడుదల కానుంది. డైరెక్టర్ టి చంద్రశేఖర్, రమేష్ లు కలిసి దర్శకత్వం వహించిన సినిమా బుట్ట బొమ్మ. ఈ సినిమాలో అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ జంటగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
Upcoming Movies: ఇక ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు, సీరిస్ ఇవే..
నెట్ఫ్లిక్స్ లో పమీలా అనే హాలీవుడ్ సిరీస్ జనవరి 31, గంతేర్స్ మిలియన్స్ అనే సిరీస్ ఫిబ్రవరి 1న, క్లాస్ అనే సిరీస్, ట్రూ స్పిరిట్ అనే సిరీస్, ఇన్ ఫయిస్టో అనే హాలీవుడ్ సిరీస్, స్ట్రామ్ బాయిల్ అనే సిరీస్, వైకింగ్ ఊల్ఫ్ అనే సిరీస్ ఫిబ్రవరి 3న విడుదల కానున్నాయి. ఆహాలో అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ కానున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బ్లాక్ పాంథర్ వాఖండ ఫరెవర్ అనే హాలీవుడ్ సీరిస్ ఫిబ్రవరి 1న, సెంబి అనే తమిళ్ సిరీస్ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. జహానాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ అనే హిందీ సిరీస్ ఫిబ్రవరి 3న విడుదల కానుంది.