Upcoming Movies: మొత్తానికి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేసాం. పాత ఏడాది వెళ్లిపోయినప్పటికీ కూడా ఆ సమయంలో చూసిన మంచి మంచి సినిమాలు ఇప్పటికి మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది కూడా ప్రేక్షకుల మదిని దోచుకునే సూపర్ హిట్ సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి మాత్రం స్టార్ హీరోల సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
అంతలోపే ఓటీటీలో 18 సినిమాలు ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది వేదికను బాగా ఎంచుకున్నారు. ఇందులో వచ్చే ప్రతి ఒక్క సినిమాను చూడటానికి బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు అటువంటి ప్రేక్షకులకే ఈ వారం మాత్రం బాగా సందడిగా ఉండబోతుంది. ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్ లు ఏంటో చూద్దాం.
నెట్ఫ్లిక్స్ లో లేడీ వోయర్ అనే ఇంగ్లీష్ సిరీస్ జనవరి 1న, ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్ అనే ఇటాలియన్ వెబ్ సిరీస్ జనవరి 4న, స్టార్ వార్స్ బ్యాండ్ బ్యాచ్ సీజన్ 2 జనవరి 4న, ఉమెన్ ఆఫ్ ది డెడ్ అనే సిరీస్ జనవరి 5, కోపెన్ హాగన్ కౌబాయ్ అనే డానిష్ సినిమా జనవరి 5న, ముంబయి మాఫియా: పోలీస్ vs అండర్ వరల్డ్ అనే సిరీస్ జనవరి 6 న విడుదల కావటానికి సిద్ధంగా ఉన్నాయి.
Upcoming Movies: ఇక జీ 5లో ఊంచాయ్ అనే హిందీ సినిమా,
షికాపుర్ అనే బెంగాలీ సిరీస్, బేబ్ భంగ్డా పౌండే అనే పంజాబీ మూవీ జనవరి 6న విడుదల కానున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తాజా ఖబర్ అనే వెబ్ సిరీస్ జనవరి 6న విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఫోన్ బూత్ అనే హిందీ మూవీ జనవరి 2న విడుదల కానుంది. సోనీ లీవ్ లో ఫాంటసీ ఐలాండ్ సీజన్ 2, షార్క్ ట్యాంక్ సీజన్ 2 జనవరి 2న విడుదలయ్యాయి. స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే తమిళ్ సిరీస్, నవంబర్ 13 అనే హిందీ సిరీస్, జహానాబాద్ అనే హిందీ జనవరి 3న విడుదలయ్యాయి. త్రీ సీస్ అనే తెలుగు సినిమా, సౌదీ వెళ్లక్క అనే మలయాళ సినిమాలు జనవరి 6న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.