Upcoming Movies: సినీ ప్రియులు ప్రతివారం ఏయే సినిమాలు విడుదలవుతాయి అని ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి సినిమాల మీద అంత అభిమానం ఉంటుంది కాబట్టి. ఇక గత నెల జనవరిలో ప్రతి వారం మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా సందడి చేశాయి. ఇక ఫిబ్రవరి ప్రారంభం కాగా.. ఇప్పుడొచ్చే వారంలో మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకు ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
డైరెక్టర్ హర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా వేద. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, గన్వి లక్ష్మణ్ తదితరులు నటించగా 9న ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా 10న విడుదల కానుంది. ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. అవికా గోర్, సాయి రోణక్ జంటగా నటించిన సినిమా పాప్ కార్న్. డైరెక్టర్ మురళీ గంధం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 10న విడుదల కానుంది.
డైరెక్టర్ సురేష్ లంకపల్లి దర్శకత్వంలో రూపొందిన ఐపీఎల్ సినిమా కూడా 10న విడుదల కానుంది. డైరెక్టర్ రవీంద్ర గోపాల దర్శకత్వంలో రూపొందిన సినిమా దేశం కోసం భగత్ సింగ్ 10న విడుదల కానుంది. డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్ జి దర్శకత్వంలో రూపొందిన సినిమా చెడ్డి గ్యాంగ్ తమాషా. ఇక ఈ సినిమా కూడా 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Upcoming Movies: ఓటీటీ లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..
నెట్ఫ్లిక్స్ లో అజిత్ నటించిన తెగింపు సినిమా 8న స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాజయోగం అనే సినిమా 9న స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫర్జీ అనే వెబ్ సిరీస్ 10న స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో కళ్యాణం కమనీయం కూడా 10న స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఇవే కాకుండా నెట్ఫ్లిక్స్ లో బిల్ రస్సెల్: లెజెండ్ అనే వెబ్ సిరీస్, ద ఎక్స్చేంజ్ అనే హాలీవుడ్ సిరీస్ ఫిబ్రవరి 8న స్ట్రీమింగ్ కానున్నాయి. యు అనే వెబ్ సిరీస్ ఫోర్, డియర్ డేవిడ్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 9న, యువర్ ప్లేస్ ఆర్ మైన్ అనే హాలీవుడ్ మూవీ, టెన్ డేస్ ఆఫ్ ఏ గుడ్ మాన్ అనే హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాట్ డెడ్ ఎట్ అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 9న, హన్నికాస్ లవ్ షాది డ్రామా రియాలిటీ షో ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానుంది. సోనీ లీవ్ లో నిజం విత్ స్మిత అనే టాక్ షో ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానుంది.