Upcoming Movies: చదువులతో సంవత్సరం అంతా అలసిపోయిన విద్యార్థులు మొన్ననే పరీక్షలు ముగించి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక వారి దృష్టి అంతా రాబోయే సినిమాల మీదనే. మరి ఈ వారం థియేటర్లో ఏం సినిమాలు వస్తున్నాయో, ఓటీటీ లో ఏం సినిమాలు వస్తున్నాయో ఓ లుక్కేద్దాం రండి.
ఈ వారం సినిమాలనగానే అందరి దృష్టి పడేది నాని సినిమా “దసరా” మీదనే. ఇప్పటికే టీజర్ ద్వారా మంచి హైప్ ని సంపాదించింది ఈ మూవీ. కంటెంట్ లో ఒరిజినాలిటీ ఉంటే చాలు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు క్లిక్ అవుతున్నాయి అదే నమ్మకంతో దసరా మూవీ ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకి సిద్ధం చేస్తున్నారు.
బొగ్గు గనులు ఉండే ఈర్లపల్లి గ్రామం లో ఈ కథ నడుస్తుంది. ఊరిలో ఊర మాసుగా తిరిగే హీరో ఊరు కోసం ఏం చేశాడనేదే ఈ సినిమా. ఈ సినిమా థియేటర్లలో మార్చి 30న విడుదల అవుతుంది. అదే రోజు థియేటర్లలో రిలీజ్ అవుతున్న మరొక సినిమా పరారీ. ఇందులో యోగేశ్వర్ మొదటిసారిగా సినిమాల్లో నటించిన ఉన్నాడు ఈయన నిర్మాత జి వి వి గిరి కొడుకు.
అందుకే ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సాయి శివాజీఈ సినిమాకి డైరెక్టర్. ట్రైలర్ ద్వారా ఈ సినిమా కి కూడా మంచి హైప్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ 10 లక్షల పైగా వ్యూస్ తో వైరల్ గా మారింది. ఇంకా మార్చ్ 31న ఆదిత్య ఓం చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ దహనం కూడా రిలీజ్ అవుతుంది.
Upcoming Movies:
పెతకం శెట్టి సతీష్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి ఆడారి మూర్తి సాయి డైరెక్టర్. ఇందులో మూతపడిన శివాలయానికి మళ్లీ పూజలు మొదలుపెట్టే బైరాగిగా కనిపిస్తాడు ఆదిత్య ఓం. మార్చి 31న వీర ఖడ్గం కూడా రిలీజ్ అవుతుంది. అదే రోజున ఏజెంట్ నరసింహ- 117, సత్యం వధ.. ధర్మం చెర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంకా నెట్ఫ్లిక్స్లో మార్చ్ 26న క్రైసిస్.
అన్ సీన్ మార్చ్ 29న, ఎమర్జెన్సీ ఎన్వైసీ (ఇది వెబ్ సిరీస్ )మార్చ్ 29న, అమిగోస్ ఏప్రిల్ 1న, షహజాద ఏప్రిల్ 1న, విడుదలవుతున్నాయి. అమెజాన్లో ద పవర్ వెబ్ సిరీస్ మార్చ్ 31న విడుదలవుతుంది. అలాగే ఆహాలో సత్తి గాని రెండెకరాలు మూవీ ఏప్రిల్ 1న రిలీజ్ అవుతుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శ్రీదేవి శోభన్ బాబు మూవీ మార్చి 30న రిలీజ్ అవుతుంది.