Upsana: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేర్లలో మెగా కోడలు ఉపాసన పేరు కూడా ఒకటి.ఈమె పది సంవత్సరాల తర్వాత తల్లి కానున్న నేపథ్యంలో ఈమెకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉపాసన ప్రస్తుతం గర్భిణీ కావడమే కాకుండా ఈమె డెలివరీ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులు పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఉపాసన తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఈమెకు ఇదివరకే తన స్నేహితులు కజిన్ సమక్షంలో దుబాయిలో ఘనంగా సీమంతపు వేడుకలు నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా బుధవారం రాత్రి చిరంజీవి ఇంట్లో కూడా పలువురి సమక్షంలో ఉపాసన సీమంతపు వేడుకలు జరిగాయని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఉపాసన షేర్ చేశారు.తనకు పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ కూడా కొంత సమయం పాటు సినిమాలకు విరామం ఇవ్వాలని భావించారట.
Upsana: చరణ్ ప్రతి క్షణం సపోర్ట్ చేస్తున్నారు…
ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ కావడంతో మరి కొద్ది రోజులలో ఈమె డెలివరీ కాబోతున్నారు. ఈ క్రమంలోనే తనకు జూలై నెలలో డెలివరీ డేట్ ఇచ్చారని ఉపాసన వెల్లడించారు. ఇక రామ్ చరణ్ ప్రతి క్షణం నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాడని ఉపాసన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఎదురు చూస్తుంటారు అందరిలాగే తను కూడా తన బిడ్డ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఉపాసన తెలియజేశారు.అయితే బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఒకవైపు తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు తన వృత్తిపరమైన జీవితంలో కూడా ముందుకు సాగుతానని ఇలా ఈ రెండింటిని చాలా బ్యాలెన్స్ గా ప్లాన్ చేశానని ఉపాసనం ఈ సందర్భంగా తెలియజేశారు.