Urfi Javed: ఉర్ఫీ జావెద్ పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో విభిన్నమైన వస్త్రధారణతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.దాదాపు తన శరీరాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేస్తూ ఈమె వస్త్రధారణ ఉండడంతో ఎంతోమంది ఈమె వ్యవహార శైలి పై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన వస్త్రధారణ గురించి నటి ఉర్ఫీ జావెద్ ఇదివరకే స్పందించి తను ఏదైనా దుస్తులు నిండుగా ధరిస్తే తన శరీరం మొత్తం అలర్జీ వస్తుందంటూ అలర్జీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇలా ఈమె దుస్తులంటే అలర్జీ అని చెప్పి కేవలం టూ పీస్ డ్రెస్ ధరించి బహిరంగంగా రోడ్లపై నడుస్తూ వెళ్తున్నారు. అయితే ఇలా అర్థనగ్న ప్రదర్శనతో మహిళలు రోడ్లపై నడచడం వల్ల ఇతరులకు ఎంతో ఇబ్బందికరంగా మారుతుందని భావించినటువంటి బిజెపి నేత చిత్ర కిషోర్ వాఘ్ ఘాటు విమర్శలు చేసింది. దీంతో ఆగ్రహించిన ఉర్ఫీ .. మహారాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈమె మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తూ బిజెపి నేత తనని బహిరంగంగా బెదిరింపులకు పాల్పడటమే కాకుండా తనకి హాని చేస్తానని బెదిరించిందని చిత్ర కిషోర్ వాఘ్ పై ఫిర్యాదు నమోదైంది. అలాగే.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సంబంధిత సెక్షన్ కింద చర్య తీసుకోవాలని ఉర్ఫీ జావేద్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.
Urfi Javed: ఉర్ఫీ జావేద్ కు ప్రత్యేక రక్షణ కల్పించాలి…
ఉర్ఫీ జావేద్ తరఫు న్యాయవాది ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘బిజెపి మహిళా నేత చిత్ర ప్రజా హానీ కలిగించేలా బెదిరింపులకు పాల్పడినందుకు ఆమెపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదు చేశాను. ఆ నేతపై ఐపీసీ సెక్షన్ U/s 153(A)(B), 504, 506, 506(ii) కింద ఫిర్యాదు చేశామని, మహిళా కమిషన్ చైర్ పర్సన్ రుపాలీ చకంకర్‌ను కలిసి .. ఆ నేతకు వ్యతిరేకంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. చిత్ర వాఘే నటి ఊర్ఫీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యల అతనంరం నటి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు రక్షణ కల్పించాలని కోరానని ఉర్ఫీ జావేద్ తరఫు న్యాయవాది వెల్లడించారు మరి ఈ వివాదం ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.