Urfi Javed: ఉర్ఫీ జావేద్ పరిచయం అవసరం లేని పేరు ఈమె సినిమాలలో నటించి పేరు సంపాదించుకోవడం కన్నా విభిన్నమైన వస్త్రధారణతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచేవారు. ఇలా తరచూ విభిన్నమైన దుస్తులు ధరించి భారీ ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంటారు.అయితే ఈమె ఇలాంటి వస్త్రధారణతోనే బయట కూడా తిరగడంతో ఎంతోమంది ఈమె వస్త్రధారణ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇలా ఈమె వస్త్రధారణ పట్ల ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఈమె వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు.
ఇలా తరచూ విభిన్నమైన వస్త్రధారణతో వార్తల్లో నిలుస్తున్నటువంటి బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ తాజాగా ఆమె వస్త్రధారణ పై స్పందిస్తూ బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిని బట్టి న్యూడిటీ, వల్గారిటీకీ అర్థం మారుతుంది అంటూ ఈమె బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోని ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను నా ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా దుస్తులు ధరించనంత వరకు ఎవరు నన్ను జైలుకు పంపించలేరు అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
Urfi Javed: ఎవరు నన్ను జైలుకు పంపలేరు…
ఇకపోతే ఇలాంటి దుస్తుల ధరించి జనావాసంలో నటి ఉర్ఫీ జావేద్ తిరగటం వల్ల ఈ ప్రభావం ఎంతోమంది పై పడుతుందని పలువురు ఈమె వ్యవహరి శైలి మార్చుకోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మహిళ మోర్చా చీఫ్ చిత్ర కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈమె ఫిర్యాదు పై నటి ఉర్ఫీ జావేద్ స్పందించి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. మొత్తానికి ఈమె బోల్డ్ డ్రెస్ వ్యవహారం పై స్పందించి తిరిగి బోల్డ్ కామెంట్స్ చేయడంతో ఈ విషయం కాస్త పలు చర్చలకు దారితీస్తుంది.