Bigg Boss: బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం వివిధ భాషలలో ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇక తెలుగులో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే 6 సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ ప్రసారమవుతుంది. ఏడవ సీజన్లో కూడా ఇప్పటికే 10 వారాలను పూర్తి చేసుకుని 11వ వారం కూడా పూర్తి కావస్తుంది. అయితే ఈ సీజన్ మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుందని చెప్పాలి. ఇది ఇలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, విన్నర్ వీ జే సన్నీ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను బయటపెట్టారు.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పాల్గొన్నటువంటి ఈయన ఈ కార్యక్రమం స్క్రిప్ట్ మాత్రం కాదని అక్కడ ఎవరి ఆట వారే ఆడాలి తప్ప బిగ్ బాస్ చెప్పినట్టు ఎవరు ఆడరు అని సన్నీ తెలిపారు. ఇక ఈ కార్యక్రమం గురించి ఈయన మాట్లాడుతూ విన్నర్ కోసం 50 లక్షల ప్రైజ్ మనీ అని ప్రకటించే మాట వాస్తవమే కానీ గెలిచిన వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వరని సన్నీ తెలిపారు. 50 లక్షల రూపాయలు అని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పినప్పటికీ టాక్స్ పేరిట ఛానల్ వారు కట్ చేసుకుని మిగతాది మాత్రమే ఇస్తారని వెల్లడించారు.
సగం మొత్తం టాక్స్ కట్ చేశారు..
బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగిన వారు విన్నర్లుగా నిలబడితే వారికి గవర్నమెంట్ కోసం చెల్లించాల్సిన టాక్స్ మొత్తం కట్ చేసుకుంటారు. ఇక నేను గెలిచినప్పటికీ నాకు ప్రైజ్ మనీలో కేవలం సగం మాత్రమే డబ్బు వచ్చిందని మిగతా సగం టాక్స్ కోసమే కట్ చేసుకున్నారని ఈయన తెలిపారు. కష్టపడి ఆడి గెలిచింది నేనైతే ప్రైజ్ మనీ మాత్రం గవర్నమెంట్ వాళ్లు తీసుకున్నారని సన్నీ తెలిపారు. చాలామంది మేం డొనేట్ చేస్తాం అంటూ బయట డొనేషన్ల పేరిట టాక్స్ లు కట్టకుండా డబ్బు మొత్తం వాళ్లే తీసుకుంటారు అయితే మనకు అలాంటి తెలివితేటలు లేక బిగ్ బాస్ లో గెలుచుకున్న డబ్బు మొత్తం దాదాపు గవర్నమెంట్ కి చెల్లించాను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.