Ananya : తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రంలో గిరిజన యువతి పాత్రలో నటించి ఓవర్ నైట్ లో స్టార్ సెలబ్రిటీగా మారిపోయిన తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య నాగల్ల గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ వకీల్ సాబ్ చిత్రంలో నటించడానకంటే ముందుగా మిస్టర్ మల్లేశం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు. కానీ వకీల్ సాబ్ చిత్రంతో నటించిన తరువాత ఈ అమ్మడి సినీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీంతో ప్రస్తుతం నటి అనన్య నా కి తమిళ, మలయాళం తదితర సినిమా ఇండస్ట్రీ లో నుంచి కూడా ఆఫర్లు క్యూ కడుతున్నట్లు సమాచారం.
అయితే ఈ మధ్య కాలంలో నటి అనన్య నాగల్ల సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా యాక్టివ్ గా ఉంటూ తరచూ అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని పెంచుకుంటోంది. అయితే తాజాగా ఈ అమ్మడు సెలవులను ఎంజాయ్ చేసేందుకు థాయిలాండ్ దేశానికి వెళ్లినట్టు సమాచారం. అంతేకాకుండా థాయిలాండ్ దేశంలో దిగినటువంటి ఫోటోలను కూడా తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడు అందమైన ఫోటోలకి నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే ఈ మధ్య నటి అనన్య నాగల్ల సినిమా ఆఫర్ల కోసం గ్లామర్ డోస్ పెంచిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి ఈ బ్యూటీకి మెండుగా ఉన్నప్పటికీ అదృష్టం సరిగా లేకపోవడంతో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఇప్పటివరకు సరైన అవకాశం రాలేదు. దీంతో అన్ని ఉన్నప్పటికీ అనన్య నాగల్ల స్టార్ హీరోయిన్ హోదాని అందుకోలేకపోయింది. దీంతో అనన్య ఈ మధ్య గ్లామర్ డోస్ ఎరగా వేసి ఆఫర్లను అందిపుచ్చుకోవాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి కునుకులేకుండా చేస్తోంది. నిన్న మొన్నటి వరకు చక్కని కట్టు, బొట్టు, చీరకట్టు లో కనిపించిన అనన్య ఒక్కసారిగా చిట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫోటోలకి ఫోజులు ఇవ్వడంతో కొందరు నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొందరు మాత్రం సంప్రదాయబద్దంగా కనిపించే అనన్య కూడా ఆఫర్ల కోసం అప్పుడే అందాల ఆరబోత షురూ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.