Vani Jayaram: ప్రముఖ సీనియర్ సింగర్ వాణి జయరాం అనుమానాస్పద స్థితిలో మరణించారు. శుక్రవారం ఈమె చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అయితే ఈమె మరణ వార్త తెలిసినటువంటి సినీ ప్రముఖులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.తమిళ తెలుగు భాషలతో పాటు ఇతర భాషలలో కలిపి సుమారు పదివేలకు పైగా పాటలను పాడిన వాణి జయరాం ఇలా అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఈమె మరణం పై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే వాణీ జయరాం మృతి గురించి తన పనిమనిషి సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు. వాణి జయరాం మొహంపై శరీర భాగాలపై గాయాలు ఉండడంతో ఈమెది సాధారణ మరణం కాదని ఎవరో హత్య చేశారనే అనుమానాలను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాణీ జయరాం పనిమనిషి ఈమె మరణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.వాణి జయరాం చనిపోయే ముందు తన గదిలో నుంచి పెద్దగా శబ్దం రావడంతో తాను కిటికీలోనుంచి చూసానని తెలిపారు.
Vani Jayaram: వాణి జయరాం హత్య చేయబడిందా…
ఇలా తాను కిటికీలో నుంచి చూడగానే అప్పటికే ఆమె కింద పడిపోయి ఉన్నారని, తన బంధువులు రాగానే తన గది తలుపులు పగలగొట్టి తనను బయటకు తీసుకు వచ్చినట్లు పనిమనిషి తెలియజేయడంతో పోలీసులు ఈమె మరణాన్ని అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకుని తన మరణానికి గల కారణాలు ఏంటి అని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈమె ముఖంపై ఇతర శరీర భాగాలపై గాయాలు ఉండడంతో తనపై ఎవరో హత్య ప్రయత్నం చేశారని అనుమానాలు బలం అవుతున్నాయి.