Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన వరలక్ష్మి శరత్ కుమార్ అనంతరం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా అదే స్థాయిలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా ఈమె తెలుగులో లేడీ విలన్ పాత్రలలో నటించిన కెరియర్ మొదట్లో మాత్రం హీరోయిన్ గానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈమె పోడాపోడి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే తనకు హీరోయిన్ గా కన్నా విలన్ పాత్రలే మంచిగా పేరు తీసుకురావడంతో ఇలా విలన్ పాత్రలలో సెట్ అయ్యారు.
ఇలా వరుస తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ తను సినీ కెరియర్ గురించి, ఇండస్ట్రీలో తాను కోల్పోయిన సినిమాల గురించి తెలియజేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.తనకు ఇండస్ట్రీలోకి రావాలని ఎంతో కోరికగా ఉండేది అందుకే సినిమా ఆడిషన్స్ కి కూడా వెళ్లానని ఈమె తెలియజేశారు. ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా ఆడిషన్ కి కూడా తాను వెళ్ళానని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు.
Varalakshmi Sarath Kumar: బాయ్స్ సినిమాలో నేనే నటించాల్సి ఉంది…
ఈ సినిమాలో జెనీలియా పాత్ర కోసం నన్ను ఆడిషన్ చేశారని ఈ పాత్రకు స్క్రీనింగ్ టెస్ట్ కూడా పూర్తి అయ్యి ఎంపిక అయ్యానని వరలక్ష్మి శరత్ కుమార్ తెలియజేశారు.ఇక ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు నాన్న నటిగా ఇండస్ట్రీలోకి రావడానికి ఒప్పుకోలేదని నాన్న నిరాకరించడం వల్ల తాను ఇంకా ఎన్నో మంచి సినిమా అవకాశాలు కోల్పోయానని ఈ సందర్భంగా వరలక్ష్మి తెలియజేశారు. నాన్న ఇండస్ట్రీలోకి రావడానికి వ్యతిరేకి కాదు కానీ ముందు చదువు పూర్తి చేసిన తర్వాతే నటన వైపు రావాలని ఆయన భావించారు. అందుకే తాను ఎన్నో మంచి అవకాశాలు కోల్పోయానని ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.