Varasudu Movie Review: రిలీజ్ డేట్: 14 జనవరి 2023
నటినటులు: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, సత్యరాజ్, ప్రభు, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, యోగిబాబు, శ్యామ్, సుమన్, ఖుష్బూ తదితరులు
డైరెక్టర్: వంశీ పైడిపల్లి
నిర్మాతలు: దిల్ రాజ్, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్. ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన సినిమా వారసుడు. ఇందులో విజయ్, రష్మిక మందన జంటగా నటించారు. అంతేకాకుండా శరత్ కుమార్, సత్యరాజ్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, యోగి బాబు, శ్యామ్, ఖుష్బూ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్స్ పై దిల్ రాజ్, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ సినిమా తమిళ భాషలో రూపొందగా నిన్న తమిళ భాషలో విడుదల అయింది. తెలుగులో డబ్బింగ్ చేయగా సంక్రాంతి సందర్భంగా ఈరోజు తెలుగులో విడుదల అయింది. ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ: ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో తండ్రి కొడుకుని అసలు ఇష్టపడడు. అసలు కొడుకు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడు. అటువంటి కథతో ఈ సినిమా రూపొందింది. అతిపెద్ద వ్యాపారవేత అయిన శరత్ కుమార్ కు ముగ్గురు కొడుకులు. అయితే తన చిన్న కొడుకు విజయ రాజేందర్ మాత్రం తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. ఇక మిగతా ఇద్దరు కొడుకులు అయిన శ్రీకాంత్, షామ్ మాత్రం తండ్రి ప్రకారం నడుస్తారు. తమ తండ్రికి వారసులం తామే అని అనుకుంటారు. ఇక విజయ్ కొన్ని కారణాలవల్ల ఇంటి నుండి వెళ్లిపోతాడు. ఇక సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఇక ఏడేళ్లుగా ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో తను తన తండ్రి ఇంటికి వచ్చేస్తాడు. అదే సమయంలో కుటుంబంతో పాటు వ్యాపారంలో కూడా సమస్యలు వస్తుంటాయి. దీంతో ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అనేది.. చివరికి తన తండ్రితో కలుస్తాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.
ప్లస్ పాయింట్స్: విజయ్ తన పాత్రతో ఫిదా చేశాడు. సెంటిమెంట్ పాత్రలలో బాగా అదరగొట్టారు. ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. సినిమా కథ బాగుంది.
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ చాలా మెల్లగా కొనసాగింది. కొన్ని సన్నివేశాలు ముందుగా ఊహించినట్లు అనిపించాయి. తమన్ మ్యూజిక్ అంతగా ఆసక్తి అనిపించలేదు.
Varasudu Movie Review:
సాంకేతిక విభాగం: డైరెక్టర్ సినిమాకు మంచి కంటెంట్ అందించాడు. సంగీతం కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మిగిలిన సాంకేతిక విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.
చివరి మాట: ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియోస్ కు బాగా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్: 2.5/5