Varsha: బుల్లితెరపై ప్రస్తుతం బాగా క్రేజ్ ఉన్న కామెడీ యాక్ట్రెస్‌లో వర్ష ఒకరు. ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ద్వారా పాపులర్ అయిన వర్ష ఆ తర్వా జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చింది. తనని ఇలియానా అంటూ సెటైర్స్ వేస్తూ కామెడీ పంచులు రాస్తూ బాగానే సపోర్ట్ చేసింది జబర్దస్త్ టీమ్. దీంతో అమ్మడికీ బుల్లితెరపై బాగా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఎక్కువగా వర్ష జబర్దస్త్ షోతో పాటు, సుధీర్ యాంకర్‌గా చేస్తున్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ సిక్ట్స్ చేస్తోంది.
అయితే, బుల్లితెర మీద పాపులర్ అయిన చాలామందికి ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు బాగా వస్తున్నాయి. ఇప్పటికే, హైపర్ ఆది, గెటప్ శీను, ఛమ్మక్ చంద్ర సహా పలువురు జబర్దస్త్ కమెడియన్స్ సినిమాలలో నటిస్తూ అలా కూడా బాగానే సంపాదిస్తున్నారు. సినిమాల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్న వారికంటే కూడా జబర్దస్త్ ప్లాట్ ఫామ్ మీద క్రేజ్ తెచ్చుకొని సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నవారే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు. అయితే, ఇలాంటి ఆఫర్స్‌ను బక్కపలచని వర్ష మాత్రం కాదనుకుంటోందట.
Varsha: కెరీర్ చేతులారా పాడు చేసుకుంటుందని నెటిజన్స్ కామెంట్స్..?
తనకు స్మాల్ స్క్రీన్‌పై ఉన్న క్రేజ్‌తో సినిమాలలో మంచి పాత్రలు చేసే అవకాశాలు వస్తున్నాయట. కానీ, ఎందుకనో వర్ష ఆ అవకాశాలను రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తను వరుసగా బుల్లితెరమీద షోస్ చేస్తూ బిజీగా ఉన్నానని సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేదని తనవద్దకు వచ్చిన అవకాశాలను తిరస్కరిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకూ నిజమో తెలియదు గానీ, వర్షకు నిజంగా సినిమా అవకాశాలు కాదనుకుంటే మంచి కెరీర్ చేతులారా పాడు చేసుకుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.