Varun -Lavanya: ముకుంద సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిదా, కంచె, మిస్టర్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇది ఇలా ఉండగా గత కొంతకాలంగా వరుణ్ తేజ్ వివాహం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాటితో ప్రేమలో ఉన్నారని తొందరలోనే వారిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా వారి నిశ్చితార్థానికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన వరుణ్ లావణ్య నిశ్చితార్థం జరిపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారని, ఇప్పటికే నిశ్చితార్థానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించారని సమాచారం. అలాగే వీరి నిశ్చితార్థానికి ఇప్పటికీ ఇండస్ట్రీలోనే పెద్దలకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా లావణ్య వరుణ్ తేజ్ మధ్య ప్రేమ చిగురించటానికి ” మిస్టర్ ” సినిమా షూటింగ్ కారణం. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది.

Varun -Lavanya: శీను వైట్ల కారణమా…
అయితే ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి దర్శకుడు శ్రీనువైట్ల కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. 2017 శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలో లావణ్య, వరుణ్ తేజ్ కలిసి నటించారు. అందువల్ల వీరిద్దరి మధ్యా ప్రేమ పుట్టడానికి శ్రీను వైట్లనే కారణం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా సోషల్ మీడియాకు శ్రీను వైట్ల సినిమాల్లోని మీమ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. కానీ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమ వల్ల శ్రీను వైట్ల మీదే మీమ్స్ చేస్తూ.. నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.