Varun Tej:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవ దారి అర్జున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాల గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలోపెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ వరుణ్ తేజ్ ను ప్రశ్నిస్తూ ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు.వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సుమ ఈయనని ప్రశ్నిస్తూ పెళ్లి తర్వాత అల్లు అర్జున్ రామ్ చరణ్ వీరిద్దరిలో ఎవరిలో ఎక్కువగా మార్పులు కనిపించాయి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ ఏం చెప్పాలో తెలియక ఈ ప్రశ్న నాకన్నా వారిద్దరిని అడిగితేనే బాగుంటుంది అంటూ సమాధానం చెప్పారు. అనంతరం ఈయన మాట్లాడుతూ పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరు తప్పకుండా మారాల్సిందేనని తెలిపారు.
Varun Tej: పెళ్లి తర్వాత మారాల్సిందే…
ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఉద్దేశిస్తూ మేము ఎఫ్2 సినిమా చేసే సమయంలో ఆయన మాకు ఇదే నేర్పించారని వరుణ్ తేజ్ వెల్లడించారు. పెళ్లి తర్వాత ప్రతి ఒక్క అబ్బాయి తప్పకుండా మారాల్సిందేను అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ సమాధానం చెప్పడంతో భార్యలు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చరణ్ కూడా మారిపోయారని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ఇక త్వరలోనే ఈయన కూడా నటి లావణ్య త్రిపాఠినీ పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివరిలో తమ వివాహం జరగబోతుందని వరుణ్ తేజ్ వెల్లడించారు.