Varun Tej -Lavanya Tripati: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొద్ది రోజులలో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన నటి లావణ్య త్రిపాఠిటీతో రహస్యంగా ప్రేమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇలా వీరి మధ్య ఏడు సంవత్సరాల పాటు కొనసాగిన ప్రేమ విషయాన్ని తాజాగా బయట పెడుతూ అందరికి షాక్ ఇచ్చారు.ఇలా జూన్ 9వ తేదీ వీరిద్దరూ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆగస్టు చివరిలో వీరి వివాహం ఉండబోతుందంటూ వీరి పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది.
ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా పెళ్లి గురించి రోజుకు ఒక వార్త వైరల్ గా మారింది. అయితే వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ అని తెలుస్తుంది.లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ వివాహానికి కేవలం 50 మంది మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం అయితే వీరిద్దరికి మొదటిసారి పరిచయం ఎక్కడ జరిగింది? ఎక్కడ వీరు ప్రేమలో పడ్డారో అక్కడే తమ పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారట .ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
Varun Tej -Lavanya Tripati: రాజరికపు పద్ధతిలో వివాహం..
ఆగస్టు చివరి వారంలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇప్పటికే పలువురు వెడ్డింగ్ ప్లానర్స్ ఇటలీలో వీరి వివాహానికి అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టారని సమాచారం. ఇకపోతే వివాహ వేడుకను రాజరికపు పద్ధతిలో చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇటలీలో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగిన అనంతరం వారం తరువాత హైదరాబాదులో సినీ సెలబ్రిటీల సమక్షంలో వీరి వివాహ రిసెప్షన్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నట్టు సమాచారం.త్వరలోనే వీరి వివాహ వేడుకకు సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించబోతున్నారు.