Varun Tej -Lavanya Tripati: ప్రస్తుతం మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ జూన్ 9వ తేదీ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా కాలంగా వీరి ప్రేమ గురించి అనేక వార్తలు వినిపించినప్పటికీ ఎక్కడ స్పందించని వరుణ్ తేజ్ ఏకంగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు.
ఇక వీరి నిశ్చితార్థం జరిగిన దగ్గర నుండి వీరి పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ లావణ్య వివాహం కూడా నిహారిక వివాహం లాగే ఉదయపూర్ లో ఘనంగా జరగబోతుందని ఒక వార్త వినిపించింది. అలాగే వీరిద్దరూ ఇటలీ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు కూడా మరొక వార్త వైరల్ అయింది. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీ వర్గాలనుండి అంటున్న సమాచారం ప్రకారం ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది..
Varun Tej -Lavanya Tripati: ప్రారంభమైన పెళ్లి పనులు…
ఎఫ్ 3 తర్వాత వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ అనే క్లాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు 25న సినిమా రిలీజ్ అవుతుండగా ఆగస్టు 24న వరుణ్ తేజ్ వివాహం చేసుకుంటాడా అని ఒక ప్రశ్న తలెత్తింది . దీంతో నిజంగానే వరుణ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా? లేదా? అని అభిమానులలో అనుమానం మొదలైంది . ఏది ఏమైనా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం పట్ల మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.