Varun Tej: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్ ఆ పై పలు సినిమాల్లో నటించి నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ క్రమంలో అడపాదడపా వరుణ్ తేజ్ కొంత ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.
ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక తొలిప్రేమ సినిమా విషయానికొస్తే వరుణ్ యాక్టింగ్ లెవెల్స్ తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో కనబరిచాడు. వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటాడు.
ఇక వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన గని సినిమా గురించి మనకు తెలుసు. కాగా ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లోక్ టీజర్ లకు ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 8న థియేటర్ల ముందుకు రాబోతుంది.

Varun Tej: నాగబాబు వరుణ్ తేజ్ ను నిహారికను త్వరగా రమ్మని చెప్పడానికి కారణం ఇదే!
కాగా ఈ సినిమా ప్రమోషన్ ల నేపథ్యం లో పాల్గొన్న వరుణ్ తేజ్ తన వ్యక్తిగతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. నేను షూటింగ్లో ఉన్న సమయంలో నిహారిక ను నన్ను నాన్నగారు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. మేము అలా అడగొద్దు అని చెప్తూనే ఉంటాం. కానీ అతడు తండ్రి కాబట్టి ఎక్కడ ఉన్నా త్వరగా వచ్చేయండి అని చెబుతారు. అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.