Vasuki Anand 1998వ సంవత్సరంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు వెటరన్ హీరోయిన్ కీర్తి రెడ్డి తదితరులు కలిసి జంటగా నటించిన తొలిప్రేమ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ప్రముఖ సీనియర్ దర్శకుడు ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించగా వర్తమాన నటి వాసుకీ ఆనంద్ హీరో చెల్లెలి పాత్రలో నటించింది. అయితే నటి వాసుకీ ఆనంద్ ఈ చిత్రంలో నటించిన తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. అలాగే పలు టాలీవుడ్ చిత్రాలకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
దీంతో నటనకి పూర్తిగా గుడ్ బై చెప్పి తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడింది. ఈ క్రమంలో కొంతకాలం పాటు సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం కూడా చేసింది. ఆ తర్వాత తన భర్తకి చేదోడుగా నిలిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం నటి వాసుకీ ఆనంద్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే వాసుకీ ఆనంద్ ఓ మలయాళ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో నటి వాసుదేవానంద సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. దీంతో అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. అయితే వాసుకి ఆనంద్ లేటెస్ట్ ఫోటోలను ఒకసారి చూసినట్లయితే అప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా లేకుండా అంతే అందంగా కనిపిస్తోంది.

దీంతో కొందరు నెటిజన్లలో ఈ విషయంపై స్పందిస్తూ నటి వాసుకి ఆనంద్ కి ఎలాంటి పాత్రలోనైనా నటించి ఆకట్టుకునే లక్షణాలు మెండుగా ఉన్నాయని దాంతో ఇప్పుడు సినిమాల్లో నటించాలని ఆఫర్ల కోసం ప్రయత్నించినా సరే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరి వాసుకి ఆనంద్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.