Vasundhara: నందమూరి నటసింహం బాలకృష్ణ భార్య వసుంధర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె స్టార్ హీరో భార్య అయినప్పటికీ ఎక్కడ కూడా గర్వం చూపించకుండా ఒక సాధారణ వ్యక్తి లాగే ఉంటారు. ఇక బాలకృష్ణ సినిమాల పరంగా బిజీగా ఉండగా వసుంధర మాత్రం కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఓ మంచి తల్లిగా గుర్తింపు పొందారు. ఇకపోతే ఈమె బయట ఏ ఫంక్షన్లకి హాజరు కారు కేవలం కుటుంబ ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతూ సందడి చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా తాజాగా వసుంధర గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వసుంధర చేయి చాలా లక్కీ హ్యాండ్ అని ఈమె చేతి మీదగా ఏదైనా సహాయం చేస్తే తప్పకుండా వారు సక్సెస్ అవుతారనే వార్త సంచలనంగా మారింది. ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించే వారు లేకపోతే ఇతర అవసరాల కోసం వసుంధర చేతుల మీదుగా డబ్బును కనుక తీసుకుంటే ఆ పనిలో వారు సక్సెస్ సాధిస్తారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అందుకే ఈమెది గోల్డెన్ హ్యాండ్ అంటూ ఈమెతో మంచి పరిచయం ఉన్నటువంటి వారందరూ తనతోనే డబ్బు తీసుకుంటారని తెలుస్తోంది.
Vasundhara: ఏ వేడుక జరిగినా వసుంధర ఉండాల్సిందేనా….
ఇకపోతే బాలకృష్ణ సినిమాలు చేసే సమయంలో నిర్మాతలు కూడా వసుంధర దేవి చేతుల మీద గానే ముందుగా డబ్బు తీసుకొని సినిమా పనులను ప్రారంభిస్తారట.ఇక ఏదైనా శుభకార్యం కూడా ఈమె చేతుల మీదుగా మొదలు పెడితే తప్పకుండా ఆ శుభకార్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో విజయవంతంగా జరుగుతుందని అందరు భావిస్తారు అందుకే నందమూరి ఫ్యామిలీలో ఏ వేడుక జరిగిన మొదట ప్రాధాన్యత వసుంధరకు ఇవ్వడం విశేషం.ఇలా మంచి మనసుతో ప్రతి పనిని ప్రారంభించడం వల్లే ఆ పనులు విజయవంతం అవుతాయని తెలుస్తోంది.