Veera Simha Reddy: బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ క్రమంలోనే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు నిర్వహించారు.అయితే మైలవరం నియోజకవర్గంలో బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా ఫ్లెక్సీలో వైసిపి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉండడం గమనార్హం.
ఇలా బాలకృష్ణ సినీ హీరోగా మాత్రమే కాకుండా టిడిపి ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు.ఇలాంటి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ ఈ సినిమాలో వైసిపికి వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పారని ఇప్పటికే వినికిడి ఉంది. ఇలా వైసీపీని టార్గెట్ చేస్తూ బాలకృష్ణ డైలాగులు చెప్పిన సినిమా ఫ్లెక్సీల పై వైసీపీ ఎమ్మెల్యే ఫోటో ఉండడం అందరికీ పలు అనుమానాలను కలిగిస్తుంది.అయితే గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహార శైలి కూడా పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.
Veera Simha Reddy: వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వసంత కృష్ణ ప్రసాద్…
ఈయన వచ్చే ఎన్నికలలో కూడా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే పార్టీలో కొనసాగుతానని లేకపోతే ఇలాంటి అదునపు పనులు చేయడం తన వల్ల కాదని చెప్పడమే కాకుండా గడపగడపకు జగన్ అనే కార్యక్రమాన్ని కూడా తిరస్కరించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన అనంతరం ఈయన ఫోటో ఏకంగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఫ్లెక్సీల పై ఉండడంతో ఈయనకు కనుక టికెట్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా పార్టీ వీడే సూచనలు అధికంగా ఉన్నాయని పలువురు ఈ పోస్టర్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. మరి వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.