Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన దగ్గుబాటి వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వెంకటేష్ నటించిన సినిమాలు అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఇటీవల రానా, వెంకటేష్ కలసి నటించిన ‘ రానా నాయుడు ‘ అనే వెబ్ సిరీస్ వల్ల వెంకటేష్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకొని వెంకటేష్ ఇలా మొదటిసారిగా విమర్శల పాలవుతున్నాడు. రానా నాయుడు వెబ్ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్ గా రూపొందించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఈ వెబ్ సిరీస్ గురించి స్పందిస్తూ.. వెంకటేష్,రాణా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో గీతాకృష్ణ మాట్లాడుతూ..’ నిజ జీవితంలో వెంకటేష్ ,రానా అంత పవిత్రులేమీ కాదు. వాళ్లు తమకు నచ్చిన కథని వెబ్ సిరీస్ గా చేస్తే తప్పేంటి అని ప్రశ్నించాడు. ఈ మేరకు రానా చాలా మంది అమ్మాయిలతో టైంపాస్ చేసేవాడని, గతంలో సుచీ లీక్స్ లో కూడా రానాకి సంబందించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి అనే విషయాన్ని గుర్తు చేస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. రానా వ్యవహారం గురించి ఇప్పటికే అందరికీ తెలుసు.
Venkatesh: మచ్చలేని హీరో వెంకీ…
అయితే ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన వెంకటేష్ గురించి గీతాకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళని వెంకటేష్ ని టార్గెట్ చేస్తూ గీతాకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వెంకటేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ గురించి ఏమి తెలుసని ఆయన కామెంట్లు చేశారు? అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి వెంకటేష్ గురించి గీత కృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.