Venu Swami: విజయ్ దేవరకొండ నటి రష్మిక మందన్న జోడికి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి గీతాగోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలలో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ జోడి బాగా పాపులర్ అయ్యారు.దీంతో ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు. ఈ వార్తలకు అనుగుణంగానే విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కూడా తరచూ పలు వెకేషన్లకు లకు వెళ్లడం రెస్టారెంట్లలో కనిపించడంతో వీరి గురించి వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది.
ఇకపోతే ఈ విషయంపై రష్మిక పలుమార్లు స్పందిస్తూ విజయ్ దేవరకొండతో తనకు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలియజేశారు.ఇలా రష్మిక ఎన్నోసార్లు వీరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పినప్పటికీ వీరి గురించే వచ్చే వార్తలు ఏమాత్రం ఆగడం లేదు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకున్నారు.
Venu Swami: మరింత చిక్కుల్లో రష్మిక కెరియర్…
ఈ క్రమంలోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తరచూ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తుంటారు. గత కొద్దిరోజులుగా ఈమె వరుస వివాదాలలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే రష్మిక ఇలాంటి వివాదాలలో నిలవడానికి గల కారణం ఈమె విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉండడమేనని ఆయన జాతక ప్రభావం ఈమెపై పడిందంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.వీరిద్దరూ తమ రిలేషన్ ఇలాగే కొనసాగిస్తే రష్మిక కెరియర్ ఎంతో కష్టంగా మారుతుందంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు విజయ్ రష్మిక అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు.