Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పిన విషయాలన్నీ కూడా నిజం కావడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య పెరిగిపోతుంది.సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉండే వేణు స్వామి తాజా ఫొటో షూట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఈవెంట్ జరిగిన ఫోటోషూట్ చేయడం సర్వసాధారణం.
ఈ క్రమంలోనే చాలామంది ఫ్రీ వెడ్డింగ్ షూట్ అని పోస్ట్ వెడ్డింగ్ అంటూ వివిధ రకాలుగా ఫోటోషూట్ లో జరుపుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఓ జంట బురదలో ఫోటో షూట్ జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే మరొక నటి విడాకులు తీసుకున్న సందర్భంగా ఫోటోషూట్ జరుపుకున్నారు. తాజాగా కేరళకు చెందిన ఒక జంట మెటర్నటీ ఫోటోషూట్ జరుపుకోవాలని కాకుండా ఇద్దరు కలిసి డాన్స్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Venu Swamy:ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలో…
ఈ వీడియోని వేణు స్వామి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఇంకా మనం ఇలాంటి ఎన్ని దరిద్రాలను చూడాలో అంటూ కామెంట్ చేశారు. మొన్న బురదలో వెడ్డింగ్ షూట్, నిన్న డైవర్స్ షూట్, ఈరోజు సీమంతం షూట్, ఇక మిగిలింది శోభనం షూట్లే అని అంటూ కామెంట్ చేశారు.ఇలా ప్రస్తుత కాలంలో కేవలం శోభనానికి సంబంధించిన ఫోటోషూట్లు మాత్రమే చేయించడం లేదు అంటూ ఈయన తీవ్రస్థాయిలో మండిపడితూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.