Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వేణు స్వామి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే వేణు స్వామి చెప్పి మాటల్లో కొన్ని సందర్భాలలో నిజం కావడం వల్ల అతనిపై ఎంతోమంది సెలబ్రిటీలకు నమ్మకం ఏర్పడింది. ఇక ఈ ఏడాది కూడా ఒక యంగ్ హీరో హీరోయిన్ చనిపోతారని గతంలో వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన చెప్పినట్లుగానే ఈ ఏడాది నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందాడు.దీంతో వేణు స్వామి మాటలు నిజమయ్యాయని వార్తలు వినిపించాయి.
ఇలా సెలబ్రిటీల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసే వేణు స్వామి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీ జంటలు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరొక సెలబ్రిటీ జంట ఈ ఏడాది విడాకుల తీసుకోవడం ఖాయం అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే సమంత నాగచైతన్య విషయంలో కూడా వేణు స్వామి చెప్పినట్టే జరిగింది. వారి పెళ్లి చేసుకున్న కొంతకాలానికి విడిపోతారని వేణు స్వామి చెప్పినట్లుగానే సమంత నాగచైతన్య ఇద్దరు కూడా ప్రస్తుతం విడాకులు తీసుకొని ఒకరికి ఒకరు దూరమయ్యారు.
Venu Swamy: విడాకులకు సిద్ధమైన స్టార్ కపుల్స్…
ఇక వీరిలాగే మరొక బాలీవుడ్ జంట కూడా విడాకులు తీసుకుంటారని వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సెలబ్రిటీ జంట మరెవరో కాదు ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్. శని ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల నాగచైతన్య – సమంతల ఈగో కారణంగానే విడాకులు తీసుకున్నారని.. ప్రస్తుతం మళ్లీ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్ కూడా అలాంటి ఇగో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తు.. ఇద్దరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలా మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకోవాలని ట్రై చేస్తున్నారని.. సేమ్ అదే జరిగితే నాగచైతన్య – సమంతల మాదిరిగానే వాళ్లు విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.