Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు
సంపాదించుకున్నటువంటి ఈయన ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీల గురించి అలాగే రాజకీయ నాయకుల జాతకాలను చూపుతూ తరచూ వార్తలు నిలుస్తున్నారు అయితే ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీల జాతకాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వేణు స్వామి తాజాగా మరో జంట గురించి కూడా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈయన చెప్పే మాటలు నిజం కావడంతో వేణు స్వామి మాటలను నమ్మే వారి సంఖ్య అధికమవుతుంది.
ఇక గతంలో ఈయన సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం తెలియడంతో వారిద్దరి జాతకాలను పరిశీలించి వారి పెళ్లి చేసుకున్న ఎక్కువ కాలం సంతోషంగా ఉండాలని విడాకులు తీసుకుని విడిపోతారంటూ చెప్పారు. ఈయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు అయితే మరికొందరి సెలబ్రిటీల విషయంలో కూడా వేణు స్వామి జోస్యం నిజమైంది.అయితే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆది పినిశెట్టి నిక్కిగల్రాని గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Venu Swamy: విడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది…
వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు అయితే వీరిద్దరూ పలు సినిమాలలో నటించడమే కాకుండా సినిమాలో షూటింగ్ సమయంలో ప్రేమలో పడటం ఆ ప్రేమ విషయాన్ని పెద్దల దగ్గర తెలియచేస్తూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి జాతకాన్ని పరిశీలించిన వేణు స్వామి వీరిద్దరి జాతకం ప్రకారం 80% విడిపోయే సూచనలే కనిపిస్తున్నాయి అంటూ తెలియజేశారు.ఈ జంట కూడా సమంత ఇలాగే విడాకులు తీసుకుని విడిపోతారు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.