Venu Swamy: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త హాట్ టాపిక్ గా మారింది. జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్న నిహారిక గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో వారిద్దరూ విడిపోతున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వార్తల గురించి మెగా కుటుంబం స్పందించకపోవడంతో విడాకుల వార్తలపై అందరికీ అనుమానాలు ఉండేవి. అయితే తాజాగా నిహారిక ఆమె భర్త చైతన్య ఈ విడాకుల వార్తలను నిజం చేస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా వీరిద్దరూ సామరస్యంగా విడిపోతున్నట్లు ఇంస్టాగ్రామ్ లో ఒక నోట్ షేర్ చేశారు. దీంతో ఇప్పుడు నిహారిక విడాకులకు కారణాల గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు కూడా తెరపైకి వచ్చింది. సెలబ్రిటీల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ వేణు స్వామి బాగా పాపులర్ అయ్యాడు. అంతే కాకుండా వేణు స్వామి చెప్పిన విషయాలు కొన్ని జరగటంతో అతను కూడా సెలబ్రిటీగా మారిపోయాడు.
Venu Swamy: వేణు స్వామి ముందే సూచించారా…
ఇదిలా ఉండగా గతంలో సమంత నాగచైతన్య విడిపోతారని వేణు స్వామి ముందే తెలిపాడు. ఆయన చెప్పినట్లుగానే కొంతకాలం సిద్ధం సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో నిహారిక విషయంలో కూడా వేణు స్వామి ముందే ఇలాంటి సూచనలు చేశాడా? అనే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా మెగా కుటుంబంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు రావడం లేదు. ఇప్పటికే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండుసార్లు విడాకులు తీసుకుంది. ఇక ఇప్పుడు నిహారిక కూడా విడాకులు తీసుకుని తన భర్తకు దూరమైంది.