Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ , రాజకీయ ప్రముఖులు జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఇలా సెలబ్రిటీలు జాతకాల గురించి చెబుతూ తరచూ వివాదాల్లో నిలుస్తున్నాడు. గతంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ లో నటించారు…
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల మీద ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉందని నందమూరి అభిమానులు, లేదు రామ్ చరణ్ నటనే హైలెట్ మెగా అభిమానుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ పోషించిన పాత్రలో చాలా లేయర్స్, వేరియేషన్స్ ఉండటం, అలాగే క్లైమాక్స్ లో కూడా రామ్ చరణ్ దూసుకుపోవడంతో సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కొంచం తక్కువైనట్టు అనిపిస్తుంది. దీంతో కొంత మంది ఎన్టీఆర్‌ను సైడ్ కారెక్టర్ అని ట్రోల్ చేస్తుంటారు. తాజాగా హాలీవుడ్‌లో ఓ రిపోర్టర్ కూడా ఎన్టీఆర్‌ను సైడ్ కారెక్టర్ అని అన్నాడట.
Venu Swamy:
ఇదే విషయాన్ని చిట్టిబాబు అనే నిర్మాత.. ఒక చానెల్‌ల డిబేట్లో పాల్గోని పదే పదే సైడ్ కారెక్టర్ అని నొక్కి మరీ చెప్పాడు. దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలో గతంలో ఎన్టీఆర్‌ది సైడ్ కారెక్టర్.. అని వేణు స్వామీ చెప్పిన వీడియో కూడా బయటకి వచ్చింది. ఈ వీడియోలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ పాత్ర లాగా ఉంటుందని చెప్పాడు. సంక్రాంతి సినిమాలో వెంకటేష్ హీరో అయితే శ్రీకాంత్ సైడ్ క్యారక్టర్. అలాగే ఇక్కడ రామ్ చరణ్ హీరో అయితే ఎన్టీఆర్ సైడ్ క్యారక్టర్ అంటూ వేణు స్వామి చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.