Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వేన స్వామి ఫేమస్ అయ్యాడు. అయితే కొందరి సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెప్పినట్టు జరగటంతో వేణు స్వామి మరింత పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా సమంత నాగచైతన్య వివాహం చేసుకోవడానికి ముందే వారిద్దరూ విడిపోతారని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయినప్పటికీ ఎంతోకాలంగా ప్రేమించుకున్న వారిద్దరూ పెద్దలు అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
అయితే వివాహం జరిగిన కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సమంతా నాగచైతన్య విడాకులు తీసుకొని దూరమయ్యారు. వీరు విడాకులు తీసుకొని దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా వీరి విడాకుల వార్త ఇప్పటికీ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఈ తరుణంలో వీరి గురించి వేణు స్వామి మరొకసారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి సమంత నాగచైతన్య విడాకులు గురించి ప్రస్తావిస్తూ..వారి పెళ్లి బంధం నిలవకపోవడానికి అసలు కారణం గ్రహాలు అనుకూలించకపోవడమే అని అన్నారు.
Venu Swamy: రెండు, మూడు పెళ్లిళ్లు జరుగుతాయి…
వీళ్లిద్దరి జాతకంలో శని ఉచ్ఛ స్థితిలో ఉందని, అందుకే వీళ్లు కలిసి ఉండలేరు తాను ముందే చెప్పినట్లు వేణు స్వామి వెల్లడించాడు. అంతే కాకుండా ఇలాంటి జాతకం ఉన్నవారికి జీవితంలో రెండు, మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. అంటే సమంత నాగచైతన్య కూడా భవిష్యత్తులో మరొకసారి పెళ్లి చేసుకోబోయే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఈ క్రమంలో వారిద్దరు మళ్ళీ కలవాలని అభిమానులు కోరుకుంటుంటే వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సమంత నాగచైతన్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.