Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఇప్పుడు తెలియని వారంటూ ఉండదు. కొంతకాలంగా ఎక్కడ చూసినా వేణు స్వామి పేరు వినిపిస్తోంది. తరచూ సెలబ్రిటీల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న వేణు స్వామి సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా బాగా ఫేమస్ అయ్యాడు. అంతేకాకుండా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఎంతోమంది హీరో హీరోయిన్లు, రాజకీయ నాయకులు వారి జాతక దోషాలు తొలగించుకోవడానికి వేణు స్వామి చేత పూజలు చేస్తుంటారు.
ఈ క్రమంలో వేణు స్వామితో కలిసి పూజలు చేస్తున్న కొందరి సెలబ్రిటీల ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి తన పూజ విధానాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ..’ నేను చేసే హంగులు ఆర్భాటాలు చూసి చాలామంది నేను సామాన్యులకు జాతకాలు చెప్పనని అనుకుంటారు. కానీ నేను సెలబ్రిటీలకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా జాతకాలు చెప్తాను. కానీ కేవలం రోజుకి 10 మంది జాతకాలు మాత్రమే చూస్తాను ‘ అంటూ తెలిపాడు.
Venu Swamy: జాతకం ప్రకారం కలిసి వస్తుంది…
అంతేకాకుండా తాను చేసే పూజలలో మాంసం మద్యం నైవేద్యంగా పెడతానని, ఎంత ఖరీదైన మద్యం పూజలో నైవేద్యంగా పెడితే అంత మంచి ఫలితం ఉంటుందని వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా పూజ ముగిసిన తర్వాత పూజలో పెట్టిన మందుని ప్రసాదంగా ఇస్తానని తెలిపాడు. అలాగే నెలలో కేవలం పది రోజులు మాత్రమే జాతకాలు చెప్తానని మిగిలిన 20 రోజులు ఇతర రాష్ట్రాలకు వెళుతుంటానని తెలిపాడు. త్వరలోనే ఒక పబ్ ఓపెన్ చేయబోతున్నట్లు వేణు స్వామి తెలిపాడు.నా జాతకం ప్రకారం నాకు ఆల్కహాల్ వ్యాపారం కలిసి వస్తుందని ఉంది అందుకే పబ్ పెట్టబోతున్నానని వేణు స్వామి తెలిపారు.