Venuswamy:వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి ఈ మధ్యకాలంలో సినీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జాతకాలను చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈయన చెప్పినవన్నీ కూడా నిజం కావడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య అధికమవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీల గురించి ఈయన చెప్పిన విధంగానే జరగడంతో ఈయన ఫేమస్ అయ్యారు.తాజాగా వేణు స్వామి నటి శ్రీ లీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటి శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాల వరకు ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక శ్రీ లీల ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఇతర హీరోయిన్లకు అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీ లీల జాతకం చూసినటువంటి వేణు స్వామి ఈమె 2028 వరకు ఇలాగే నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుందని ఈయన తెలిపారు. శ్రీ లీల రాశి మీన రాశి. ఆమె జాతకంలో రాజయోగం ఉందని తెలిపారు.
Venuswamy: జాతకంలో రాజయోగం..
ఇలా జాతకంలో రాజయోగం ఉండటం వల్ల ఈమె దినదినానికి పేరు ప్రతిష్టలను సంపాదించుకోవడమే కాకుండా అదే స్థాయిలో డబ్బు కూడా సంపాదిస్తుందని వేణు స్వామి తెలిపారు. 2028 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నెంబర్ వన్ హీరోయిన్ అంటూ ఈయన తెలిపారు.దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నయనతార ఎలాంటి స్టార్డం సంపాదించుకుందో నయనతారకు పోటీగా అదే స్థాయిలో శ్రీలీలా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారనీ ఈ సందర్భంగా వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.