Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారాడు. ఆ సినిమా మంచి హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా ద్వారా రౌడీ హీరోగా మారిపోయాడు. ఇలా వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా విజయ్ క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన లైగర్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
ఇక ఆ సినిమా తర్వాత సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఇంతకాలం సమంతా అనారోగ్యం వల్ల ఈ సినిమాకు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు సమంత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం అయింది. ప్రస్తుతం కేరళలో ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా షూటింగ్ కోసం కేరళ వెళ్లాడు. కేరళ లో సమంత, విజయ్ మీద ముఖ్యమైన సీన్లు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ కేరళలో బోటింగ్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Vijay Devarakonda: కేరళలో రౌడీ హీరో..
ఈ వీడియో షేర్ చేస్తూ రైడ్ టు వర్క్ ఇన్ కేరళ అంటూ క్యాప్షన్
ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఈ బోటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని విజయ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. లైగర్ ప్లాప్ తర్వాత ఈ సినిమాతో విజయ్ సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.