Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా వరుస ఇంటర్వ్యూలకు హాజరవడం అదే విధంగా సోషల్ మీడియా వేదికగా కూడా భారీ స్థాయిలో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పలు సందర్భాలలో పెళ్లి గురించి ప్రస్తావనకు తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈయన తన పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఇందులో భాగంగా ఈయన తన చేతిని మరొక అమ్మాయి చేతిలో వేసి మన జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి కానీ ఇది ఎంతో స్పెషల్ త్వరలోనే చెప్పబోతున్న అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Vijay Devarakonda: పెళ్లికి సిద్ధమైన విజయ్…
ఇలా విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ పోస్ట్ చూసిన ఎంతోమంది అభిమానులు నేటిజన్స్ విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అందుకే ఈ విషయాన్ని ఇలా ప్రకటించారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఈయన పలుసార్లు పెళ్లి గురించి ప్రస్తావనకు రాగా తన స్నేహితులను చూస్తుంటే తనకు కూడా పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుందని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్టు కనుక చూస్తే ఖుషి సినిమా విడుదలైన తర్వాతనే ఈయన పెళ్లి గురించి ప్రకటించబోతున్నారంటూ పలువురు భావిస్తున్నారు.