Vijay Devarakonda: టాలీవుడ్ ప్రపంచానికి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తన సత్తా చాటుకుని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.
మొత్తానికి విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరోల లో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించబోతున్న లైగర్ సినిమా ద్వారా విజయ్ పాన్ ఇండియా స్టార్ గా వెలగబోతున్నాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అభిమానులలో జోష్ మరో లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో.. పూరి జగన్నాథ్ ప్రమోషన్ల విషయం లో కొంచెం ముందుగానే ఉన్నాడు. కాగా అభిమానులు ఎంతో ఆనందం గా లైగర్ సినిమాను ప్రమోట్ చేస్తూ దేవరకొండ కు ఎదురు లేదు అంటూ.. బ్రేక్ ఇస్తున్నారు. ఇక విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను మరో లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నారు.

Vijay Devarakonda: విజయ్ తన అభిమానులకు ఈ విధంగా పంచ్ విసిరాడు!
ఇక అభిమానులలో ఉత్సాహం గమనించిన విజయ్ దేవరకొండ ఒక పంచ్ విసిరాడు. నా బర్త్ డే రోజున చాలా సినిమాలు ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒక ఫెస్టివల్ లాగా ఉంది. అందరికీ విజయ్ దేవరకొండ సినిమా సెంటిమెంట్ ఎక్కువైపోయింది. అన్నీ బాగానే ఆడతాయి. ఇక నా పవర్ ఏంటో చూపిస్తా అని విజయ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు.
ఇక విజయ్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడంతో.. ప్రేక్షకుల్లో మరింత భారీ అంచనాలు పెరిగాయి. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ అంచనాల కు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇక లైగర్ సినిమాతో విజయ్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.