Vijay Nirmala: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గాను, దర్శకురాలిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి విజయనిర్మల ఒకరు. ఈమె ఏకంగా 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇలా ఈమె ఇండస్ట్రీలో వివిధ రంగాలలో పనిచేస్తూ భారీ స్థాయిలోనే ఆస్తులు కూడా పెట్టారని చెప్పాలి. ఇలా కొన్ని వందల కోట్లు సంపాదించినటువంటి విజయ నిర్మల చివరికి తన ఆస్తిని ఎవరికి రాశారు ఏంటి అనే విషయాల గురించి తాజాగా తన మనవడు నరేష్ కుమారుడు నవీన్ తెలియజేశారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నవీన్ తన నాయనమ్మ సంపాదించినటువంటి ఆస్తుల గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. తన నాన్నమ్మ విజయనిర్మల ఒకానొక సమయంలో తన తండ్రి నరేష్ వద్ద ఆస్తుల గురించి మాట్లాడుతూ సగం ఆస్తి నా పేరు మీదను సగం ఆస్తి తన తండ్రి నరేష్ పేరు మీదగా రాయాలని సలహా ఇచ్చారట. అయితే అప్పుడు నాకు ఈ ఆస్తులు గురించి పెద్దగా అవగాహన లేదు. నానమ్మ సంపాదించిన ఆస్తికి నాన్న పేరుమీదఉంటేనే బాగుంటుందని అనుకున్నాను దీంతో నానమ్మ సంపాదించిన ఆస్తులు అన్నీ కూడా నాన్న పేరు మీదనే ఉన్నాయని తెలిపారు. వీలునామాలో కూడా అలాగే రాసారని నవీన్ తెలిపారు.
Vijay Nirmala: ఆస్తి తగాదాలు లేవు…
నాన్న యాక్టివ్ గా ఉన్నంతవరకు ఆస్తి తన పేరు మీదే ఉంటుందని అనంతరం నా పేరు మీదకు వస్తుందని తెలిపారు.. ఈ ఆస్తికి మేము గార్డియన్స్ అంటూ ఈయన తెలిపారు. ఇక తన తమ్ముళ్లు రణవీర్, తేజ గురించి కూడా మాట్లాడుతూ వాళ్ళు అంటే తనకు చాలా ప్రాణం అని తెలిపారు. ఇక వీరిద్దరూ కూడా ఒకరు నరేష్ రెండవ భార్య కుమారుడు కాగా మరొకరు మూడో భార్య కుమారుడు.మేమంతా ఎప్పుడు సంతోషంగానే ఉంటామని మా మధ్య ఎప్పుడు ఆస్తి తగాదాలు రాలేదని నవీన్ తెలిపారు. ఇలా ఆస్తి గురించి నవీన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.