Vijay-Rashmika: టాలీవుడ్ ప్రపంచానికి స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల తో ఎనలేని ర్యాపో తన సొంతం చేసుకున్నాడు. ఇక తన ప్రత్యేక యాటిట్యూడ్ తో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు.
ఇక త్వరలో విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే నిన్న అనగా మే 25న బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు. నేటితో అతడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో కరుణ్ బుధవారం సాయంత్రం అతడి ఇంటిలో అద్భుతమైన పార్టీని అరేంజ్ చేశాడు.
ఇక ఈ పార్టీకి హీరో విజయ్ దేవరకొండ తో పాటు ఇండియన్ క్రష్ రష్మిక మందన కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీకి టాలీవుడ్ లో కేవలం దేవరకొండ కు మాత్రమే ఇన్విటేషన్ రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దక్షిణాది నుంచి విజయ్ దేవరకొండ తో పాటు.. రష్మిక మందన నకు కూడా పిలుపులు వచ్చాయి అన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో బాలీవుడ్ బాలీవుడ్ లో చాలావరకు సెలబ్రేటీలు హాజరైనట్లు తెలుస్తోంది.

Vijay-Rashmika: విజయ్ దేవరకొండ రస్మిక ల గురించి నెటిజన్లు ఈ విధంగా ఆలోచిస్తున్నారు!
ఇక టాలీవుడ్ లో కేవలం వీళ్ళిద్దరికీ మాత్రమే ఇన్విటేషన్ రావడం గమనార్హం. కాబట్టి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు కేవలం వీళ్ళిద్దరినె పార్టీకి ఇన్వైట్ చేయటం ఏమిటి? అని ఆలోచనలు చేస్తున్నారు. మరికొందరు రకరకాలుగా పుకార్లు కూడా గుప్పిస్తున్నారు. మొత్తానికి ఈ వార్త మాత్రం నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇక విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.