Vijay – Samantha: టాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో సమంతకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు భాషలలో సమంత నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి. సమంత హీరోలకు లక్కీ హీరోయిన్. అందుకే ఒకే హీరోతో రెండు మూడు సినిమాలు చేసి హిట్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు, స్టార్ డైరెక్టర్స్ కూడా సమంతను తమ సినిమాలలో ఎక్కువగా రిపీట్ చేసిన వారున్నారు. అందుకే, సమంత రేంజ్ ఇప్పటికీ కాస్త కూడా చెక్కు చెదరలేదు.
బాలీవుడ్‌లో కూడా ఆమె పలు చిత్రాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ మేన్ సీజన్ 2తో వచ్చిన క్రేజే దీనికి కారణం. ఇక తాజాగా సమంతకు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన సమంత నటించే అవకాశం మరోసారి అందుకుందట. ఇటీవల బీస్ట్ సినిమాతో వచ్చి హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు తెలుగులో అడుగుపెడుతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో విజయ్ ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడు.
Vijay – Samantha: విజయ్ సరసన నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
అయితే, ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నెక్స్ట్ సినిమాను చేయనున్నాడు. తాజాగా కమల్ హాసన్ హీరోగా లోకేష్ విక్రమ్మ్ సినిమాను రూపొందిచాడు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకుంది. ఇదే జోష్‌తో విజయ్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడట. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. లోకేష్ గత చిత్రాలకంటే కూడా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందట. అందుకే సమంత నాలుగోసారి విజయ్ సరసన నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.