Vijay – Shaam: తమిళ స్టార్ హీరోకి ‘కిక్’ ఇవ్వబోతున్న స్టార్ నటుడు..

G K

Vijay – Shaam: కోలీవుడ్ స్టార్ హీరో థలపతి విజయ్ హీరోగా తెలుగులో ఓ స్ట్రైట్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా
మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న విజయ్ సరసన రొమాన్స్ చేయబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా హీరో విజయ్.. హీరోయిన్, దర్శకుడు సహా చిత్ర బృందం మొత్తానికి హైదరాబాద్ పార్క్ హయాత్‌లో గ్రాండ్‌గా పార్టి ఇచ్చాడు. ఇక ఇదే జోష్‌తో దిల్ రాజు – వంశీ పైడిపల్లి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. అయితే, ఈ సినిమాలో హీరో విజయ్‌కు కిక్కిచ్చేందుకు స్టార్ నటుడుని ఎంపిక చేశారు.

Vijay – Shaam: తనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

అతనే ‘కిక్’ సినిమాతో టాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాలతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న శ్యామ్ ఈ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. విజయ్ లాంటి స్టార్ తో స్క్రిన్న్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని..ఎప్పుడెప్పుడు ఆయనతో కలిసి షూటింగ్‌లో జాయిన్ అవుతానా.. అనే ఆతృతతో ఉన్నట్టు పోస్ట్‌లో పేర్కొన్నాడు. చూడాలి మరి ఈ మధ్య కాలంలో శ్యామ్ కి తెలుగులో ఆశించిన అవకాశాలు దక్కడం లేదు. ఈ సినిమా మళ్ళీ క్రేజ్ తీసుకొస్తుందేమో.

- Advertisement -