Vijay Varma: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె నటించినటువంటి లస్ట్ స్టోరీస్ సిరీస్ ద్వారా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి నటించారు. ఈ సిరీస్లో నటించే సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది ఇలా వీరి గురించి ఎన్నో రకాల వార్తలు రావడంతో తమన్నా ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టేశారు.
ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఈమె మాట్లాడుతూ నేను విజయ్ వర్మతో రిలేషన్ లో ఉండటం నిజమేనని ఇద్దరం రిలేషన్ లో ఉన్నాము అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా వీరి రిలేషన్ గురించి బహిర్గతం కావడంతో వీరిద్దరూ పలు విదేశీ పర్యటనలు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమన్న తన ప్రియుడితో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ వెకేషన్ లో భాగంగా వీరు దిగినటువంటి ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక తాజాగా ఈ వెకేషన్ పూర్తిచేసుకుని తిరిగి ముంబై చేరుకున్నారు.
ఈ విధంగా ముంబై ఎయిర్ పోర్టులోకి వచ్చిన అనంతరం మొదట తమన్న ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాగా విజయ్ వర్మ ఎక్కడ అంటూ తనని మీడియా ప్రశ్నించారు అయితే ఈమె ఏ మాత్రం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక తమన్న వచ్చిన కొద్ది నిమిషాలకే విజయ్ వర్మ కూడా బయటకు వచ్చారు దీంతో మీడియా విజయ్ వర్మను ప్రశ్నిస్తూ మాల్దీవ్స్ వెకేషన్ లో తమన్న తో కలిసి బాగా ఎంజాయ్ చేశారా అంటూ ఓ రిపోర్టర్ తనని ప్రశ్నించారు.
ఇలా అడగటం సరికాదు…
ఈ విధంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్న విజయ్ వర్మ కు కాస్త అభ్యంతరంగా అనిపించడంతో ఈయన రిపోర్టర్ ప్రశ్నపై అసహనం వ్యక్తం చేశారు ఇలా అడగడం సరికాదు అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక తమన్నా విజయ్ ఇద్దరు కూడా పీకల్లోతు ప్రేమలో ఉండటం చూసి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తల వినిపించాయి. అయితే ఈ వార్తలపై తమన్న స్పందిస్తూ ప్రస్తుతానికి అయితే తనకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని తన దృష్టి మొత్తం కెరియర్ పైనే ఉంది తన పెళ్లి గురించి పలు సందర్భాలలో వెల్లడించారు.