Vijayendra Prasad: ఆర్ఆర్ఆర్ పార్ట్-2 ఉండనుందా.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!

Akashavani

Vijayendra Prasad: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు త్రిబుల్ ఆర్ మూవీ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ ల జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి ప్రాణం పోశాడు. దాదాపు మూడు వందల కోట్లు పైగా డబ్బు ఖర్చు చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వెలువడ్డాయి.

కాగా ఈ సినిమాను ఈ మధ్యే విడుదల చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత రోజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ లు రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు బాలీవుడ్లో పలు ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు. ఇక త్రిబుల్ ఆర్ చిత్ర యూనిట్ విషయానికొస్తే రెస్పాన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా చిల్ అవుతున్నారు.

ఇక ఇదంతా పక్కన పెడితే త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెల్ పై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్పందించాడు. ఇటీవల ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూ లో అతనికి ఎదురైన ఒక ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు. ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చాడు. త్రిబుల్ ఆర్ గురించి కొన్ని విషయాలు అడిగాడు.

Vijayendra Prasad: ఆర్ఆర్ఆర్ పార్ట్-2 ఉండనుందా.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!
Vijayendra Prasad: ఆర్ఆర్ఆర్ పార్ట్-2 ఉండనుందా.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!

Vijayendra Prasad: ఇతడి దయ ఉంటే సీక్వెల్ తప్పకుండా వస్తుంది అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు!

నేను కొన్ని ఐడియాలు ఎన్టీఆర్ కు చెప్పాను. అవి ఎన్టీఆర్ కు, రాజమౌళి కు బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే సీక్వెల్ వస్తుందని విజయేంద్రప్రసాద్ వెల్లడించాడు. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో హడావిడి చేస్తుంది. థియేటర్లు కూడా ఎప్పటికప్పుడు హౌస్ ఫుల్ బోర్డులు తోనే కనబడుతున్నాయి.

ఇక ఈ సినిమా థియేటర్లలో ఇంకెన్ని రోజులు హడావిడి చేస్తుందో చూడాలి. ఇక విజయేంద్ర ప్రసాద్ మాటలకి ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

- Advertisement -